“మనిషి కణాల్లో, ప్రతీ వస్తువులో, పదార్థంలో మనం చూసే ఆటమ్స్, వాటిలోని సబ్ ఆటమిక్ పార్టికల్స్ అయిన ప్రోట్రాన్స్, న్యూట్రాన్స్ అనేవి వాస్తవం కాదు. అవి ఒక నిర్థిష్టమైన రూపాన్ని మాత్రమే ఇచ్చేవి కావు. దానికన్నా ముఖ్యంగా అవి అనంతమైన సాధ్యాలను ప్రతిఫలించేలా ప్రవర్తిస్తాయి”. – క్వాంటమ్ మెకానిక్స్ పయనీర్, నోబెల్ ప్రైజ్ గ్రహీత వెర్నెర్ హైసెన్బెర్గ్
—————–
నా వివరణ:
ఒక మనిషి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. కడుపులో ఓ ఆర్గాన్, దాని టిష్యూ, ఆ టిష్యూలోని కొన్ని కోట్ల సెల్స్, ఆ సెల్స్‌లోని సబ్ ఆటమిక్ పార్టికల్స్‌లో ఉండే ఎనర్జీ అసమతౌల్యం వల్ల ఆ నొప్పి ఏర్పడింది.
ఆ నొప్పిని తగ్గించుకోవడానికి క్వాంటమ్ థీరీ ప్రకారం అనంతమైన పాజిబులిటీస్ ఉంటాయి. ఒక స్పిన్ రేట్ దగ్గరే నొప్పి తలెత్తింది. ఆ స్పిన్ రేట్‌ని ఓ ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా గానీ, హోమియో మెడిసిన్ ద్వారా గానీ, ఫ్రీక్వెన్సీ మెడిసిన్ ద్వారా గానీ ప్రభావితం చేసుకోగలిగితే అది ఓవరాల్ బాడీ ఇంటెలిజెన్స్, హార్మొనీకి తగ్గట్లు ఎనర్జీ స్పిన్ రేట్‌కి సరిచేయబడి పెయిన్ తగ్గుతుంది.
ఇక్కడ క్వాంటమ్ ఫిజిక్స్‌లో చెప్పబడే.. “అబ్జర్వర్ ఎఫెక్ట్” అనేది ఒకటి చెప్పుకోవాలి. స్థిరంగా లేకుండా డైనమిక్‌గా స్పిన్ అవుతుండే ఆటమ్ ఎనర్జీ ఫీల్డ్‌ని రెండు రకాలుగా ప్రభావితం చేసుకోవచ్చు.
1. స్పిరిట్యువాలిటీ అని మనం పిలుచుకునే విశ్వం యొక్క ఇంటెలిజెన్స్ క్వాంటమ్ లెవల్లో ఓ శరీరంలో బయో ఫోటాన్స్ రూపంలో ఓ కోహరినెన్స్ని సృష్టించడం ద్వారా ఓ నిర్థిష్టమైన విధంగా స్పిన్ అయ్యేలా వేవ్ రూపంలో వైబ్రేషనల్ ఎనర్జీగా మారిపోవడం. ఇక్కడ మన ప్రమేయం ఏమీ ఉండదు. విశ్వం ఇంటెలిజెన్స్ ఉంటుంది.
2. ఒక అబ్జర్వర్‌గా నాకు పెయిన్ గా ఉంది అని మన ఆలోచనల ద్వారా ఒక సెల్‌లోని ఆటమ్ యొక్క అపరిమితమైన పొజిషన్స్‌ని పెయిన్ అనే ఓ సూపర్ పొజిషన్ వద్ద సెటిల్ చేసి, పెయిన్ మరింత ఎక్కువ అయ్యేలా ఆ పెయిన్‌తో ఐడెంటిఫై అవడం. దాంతో పెయిన్ కి కారణం అయ్యే వేవ్ పొజిషన్ “సూపర్ పొజిషన్”గా మారిపోయి, పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. లేదా “నాకు ఎలాంటి పెయిన్ లేదు” అనే బలమైన ఆలోచన కలిగి ఉండడం ద్వారా వేవ్ పొజిషన్ని మరో పాజిబులిటీలో ఆరోగ్యకరమైన ఎనర్జీ లెవల్లో స్పిన్ అయ్యేలా ప్రభావితం చేసుకుని ఆరోగ్యకరంగా మారడం.
ఇలా లోతుగా స్టడీ చేసుకుంటూ వెళుతుంటే.. యూనివర్శ్ ఎంత అద్భుతమైనదో తెలుస్తోంది. I’m thankful to the universe for providing such a deep understanding. కేవలం ఆలోచనలతో తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న వారు.. కేవలం బలమైన ఇంటెన్షన్‌తో ప్రకృతిని ప్రభావితం చేయగలిగిన రుషులు కేవలం ఎనర్జీతో అసాధ్యాలను సుసాధ్యం చేసిన వారే!!
– Sridhar Nallamothu