మనకంతా డ్రమెటైజేషన్ కావాలి… సినిమాటిక్‌గా ఉండాలి…
"ఓ గొప్ప పనిచేశావంటూ…" కళ్లల్లో నీళ్లుంచుకుని ఎవరో భారీ ఎక్స్ప్రెషన్తో భుజం తడితే జీవితం ధన్యమైపోయిన సంతృప్తి…
హీరోలు ఎక్కడ నుండో పుట్టరు… చిన్న పని కష్టపడి చేసినా మనమే హీరోలం…. మన మీద ఎవరూ సినిమాలు తీయాల్సిన పనిలేదు… ఉదాత్తంగా చూపించాల్సిన పనిలేదు…
సినిమా చూస్తుంటే ఎమోషన్లు తన్నుకొస్తాయి… డైరెక్టర్ సీన్లు పండించే దాన్ని బట్టి హీరోలు ఎవరెస్ట్ శిఖరానికి ఎదిగిపోయినంత అభిమానం పుట్టుకొస్తుంది…. అదే నిజ జీవితంలో ఎవరే మంచి పని చేసినా కనీసం మనస్ఫూర్తిగా ఒక్క "బెస్ట్ విష్" కూడా చెప్పం… అంటే మన ఎమోషన్లు డ్రైమెటైజేషన్కి అలవాటు పడ్డాయన్న మాట….
అందుకే మీరేమైనా సాధించండి… nobody will be there with you… but you are 100% real Hero… యెస్… మనం కష్టపడి, మనం సాధించి… మనం ఏదో ఒకటి సమాజానికో, మనుషులతో, రిలేషన్లకో చేసి…. ఆటోమేటిక్‌గా తెచ్చుకునే హీరోయిజాన్ని ఎవరూ ఆపలేరు…. దాన్ని ఎవరూ గుర్తించాలో, ప్రదర్శించాలో అన్న ఏదైనా చిన్న కోరిక ఉంటే తుడిచి పెట్టేయండి….
సాయం చేస్తే సినిమాల్లోలా ఎవరి కళ్లల్లోనూ కృతజ్ఞత కన్పించకపోవచ్చు…. బట్ యూ ఆర్ still hero….
కష్టపడి ఏదైనా సాధిస్తున్నా ఎవరికీ పట్టనట్లు సాగిపోతూ ఉండొచ్చు… they have their own life, మన దగ్గరే ఆగిపోయి… "బాబూ…. చిట్టీ.." అని శ్రీలక్ష్మి కరుణ రసంతో పలికించినట్లు ఎక్స్ప్రెషన్లు ఇచ్చే తీరుబడి ఎవరికీ లేదు…
ఎవరి రియాక్షన్లూ లేకపోయినా…. కసిగా, పట్టుదలతో చేయాల్సింది చేసుకుపోతుంటే…. హీరోగా ఒకరు చూసేదేమిటి…. ఆఫ్టరాల్ ఒరిజినాలిటీ లేని హీరోల్ని మించి మన జీవితమే ఎదిగిపోదూ….?
గ్లామర్ ఫీల్డ్కి చాలామంది ఆకర్షితులవడానికి కారణం ఇదే…. జనాలు గొప్పగా చూడాలి… జనాలు గొప్పగా చూడడం కోసం తనని తాను చంపుకుని బ్రతకానికైనా సిద్ధపడే స్వభావం…
గ్లామర్ ఫీల్డ్‌లో సెలబ్రిటీవైనంత మాత్రాన… గొప్పదనం వచ్చేయదు…. జస్ట్ పీపుల్ మనల్ని గుర్తుపడుతున్నారంతే…. ఓ ఫలానా వ్యక్తి కదా అని ఓ 5 నిముషాలు చెప్పుకుంటారంతే… దానికే ఏదో సాధించేసినట్లు కాదు…
ఎవరిచేతో గొప్పగా కన్సిడర్ చెయ్యబడడం కోసం, హీరోలా చూడబడడం కోసం… ఓ వర్షిప్ ఫీల్‌ని పొందడం కోసం… తాపత్రయపడడం మొదలుపెట్టిన క్షణం నీ జీవితం ముగిసిపోయినట్లే….. ఆఫ్టరాల్ ఇవ్వాళ నాలుగు మాటలు గొప్పగా మాట్లాడుకుంటారు మన గురించి… రేపు మర్చిపోతారు…. ఆ చిన్న ఆనందానికే వెర్రి తాపత్రయం చైల్డిష్‌గా అన్పించట్లేదూ….
హీరోయిజం అంటే… సెలబ్రిటీ అంటే… ఓ పదిమంది మోజు కొద్దీ పూసుకు తిరగాలనుకునే మైకం కాదు… మంచి పెర్ఫ్యూమ్ స్మెల్ వచ్చినంత కాలమే అలా పూసుకు తిరుగుతారు… చెమట కంపు ఏదో రోజు కొట్టకపోదూ…. జనాలకు మోజు తీరకా పోదూ… మోజు కొద్దీ వచ్చిన వెలుగు చీకటైపోకా పోదూ… అంతే గొప్పదనం కాస్తా రోడ్డెక్కుతుంది….
బట్… నీకు నువ్వు హీరోగా ఆస్వాదించే, కష్టపడే, ఏ రంగంలో ఉన్నా… బాగా చదివైనా, బాగా వర్క్ చేసైనా, బాగా నాలెడ్జ్ పొందైనా, సోషల్ సర్వీస్ చేసైనా… ఏదైనా సాధించి హీరోగా భావించుకునే దానికి ఎక్స్పైరీ లేదు… నీకు నువ్వు గొప్పగా తోస్తే ఇంకెవరుంటారు నీకు గొప్ప? నీకు నువ్వే కొత్త milestones క్రియేట్ చేసుకుంటూ పోతే సినిమా హీరోల బాక్సాఫీస్ రికార్డులకూ… హడావుడి సెలబ్రిటీల ఆర్భాటాలకూ విలువెక్కడ? వెలవెలబోవూ అవి?
సో ఒక్కటే fact.. హీరోయిజం జనాలు గుర్తిస్తే వచ్చేది కాదు… మన చేతల ద్వారా సైలెంట్గానైనా చేసుకు వెళ్లగలిగేది…
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com