ఏం చెయ్యాలో, జీవితాన్ని ఎలా మలుచుకోవాలో గందరగోళంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఆయన మాటలు ఆదర్శం…
"ఇనుప కండరాలు, ఉక్కు పిడికిళ్లు… బలమే జీవితం, బలహీనతే మరణం…" వంటి వివేకానందుని మాటలు వింటే చాలు నీరసపడిన మనస్సుల్లోకీ అంతులేని శక్తి క్షణాల్లో తిరిగి వచ్చేస్తుంది…
కొన్ని తరాలు ఆయన అడుగుజాడల్లో ఊపిరి పోసుకున్నాయి…
ఇంత స్వార్థపూరిత, తన ఆనందం తప్ప వేరేదీ పట్టని ప్రపంచంలో ఏ మూలనో సామాజిక బాధ్యత కన్పిస్తోందంటే అది వివేకానందుని అనుచరుల చలవే.
వివేకానందని మర్చిపోయాం.. ఏ రామకృష్ణ మఠానికో వెళ్లి ఆయన మాటలు చదివే "బోరింగ్" ఇంట్రెస్టులు ఎవరికీ లేవు…
నిజ్జంగా నా మనస్సుకి అన్పించింది చెప్తున్నాను…. ఈ తరాన్ని చూసి సిగ్గుపడాల్సి వస్తోంది… వెకిలి వేషాల హీరోల్ని ఆదర్శంగా తీసుకునే దౌర్భాగ్యం మన యువతకు…
వీలైతే ప్రసంగాల్ని చదవండి… త్రికరణశుద్ధిగా ఆ మాటలు మనస్సులోకి తీసుకుని ఆచరించండి…. ఇప్పటివరకూ బ్రతుకుతున్నది ఎంత meaningless లైఫో అర్థమవుతుంది…!!
వివేకానంద పేరు చెప్తే లక్షల్లో ఫీజులు వసూలు చేసే ఇనిస్టిట్యూట్ పేర్లు మాత్రమే గుర్తొస్తుంటే.. అంతకన్నా నరాల్లో చైతన్యం కట్టలు తెచ్చుకోపోతే ఈ దేశంలో మనం పొరబాటున పుట్టినట్లే!
అస్సలు ఓపికే లేని శక్తిహీనమైన దేహాలూ… దేనిపై ఆసక్తే లేని శూన్యమైన మనస్సులూ… ఎక్కడెక్కడో ఆనందం కోసం వెంపర్లాడుతూ పోతుంటే… ఆ వెంపర్లాటలో నెగిటివ్ ఎమోషన్లనీ, మసాలాల్నీ నింపేసి మీడియా తన స్వార్థం తాను చూసుకుంటూ ఉంటే…. ఒక్క క్షణం ఆనందం కోసం చేయరాని పనులూ చేయడానికి మనం వెనుకాడకపోతుంటే…. ఏం మిగిలిందని ఈ జాతిలో!
ఒక్కసారి వివేకానందని తెలుసుకుంటే.. అన్నీ చక్కబడతాయి..!! ఇది అక్షరాలా నిజం.. ఈ జాతికి కావలసింది వివేకానందలు తప్ప పనికిమాలిన సినిమా హీరోలూ, వారిని గుడ్డిగా అభిమానించి తమ జీవితాల్ని మర్చిపోయే బాధ్యత లేని అభిమానులూ కాదు…
ఇది చదివి ఏ ఒక్క కాలేజ్ స్టూడెంట్ అయినా వివేకానంద మాటల్ని చదవగలిగితే అంతకన్నా నాకు సంతోషం లేదు…
నావరకూ నాకు నా జీవితంలో వివేకానందని మించిన స్ఫూర్తి ఏదీ లేదు..!! నా లైఫ్ ఆయన్ని ఆదర్శంగా తీసుకునే డిజైన్ చేయబడింది!!
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com