త్వరలో మార్కెట్లోకి రానున్న “ఆనందం” తెలుగు సినిమా వార పత్రికకు గౌరవ సంపాదకునిగా బాధ్యతలు చేపట్టబోతున్నాను…
గతంలో 1996 నుండి 1998 వరకూ సూపర్ హిట్ సినిమా మేగజైన్కి సబ్ ఎడిటర్‌గా రజనీ, కమల్, చిరంజీవి, బాలకృష్ణ, మనీషా, మాధురీదీక్షిత్ వంటి సీనియర్లతో కలిసి పనిచేసిన నేపధ్యంలో… అప్పటి మిత్రుడు 100 GSM హై క్వాలిటీ పేపర్‌తో మార్కెట్లోకి తీసుకురాబోతున్న పత్రిక ఇది.
నా సమయానుకూలతల బట్టి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలూ వంటివీ నిర్వహించబోతున్నాను. ఆప్తమిత్రుని కోరిక మేరకూ, అలాగే సినిమా రంగంతో నాకున్న సన్నిహిత అనుబంధం మేరకు తీసుకున్న నిర్ణయం ఇది.
కంప్యూటర్ ఎరా మేగజైన్ గత 13 సంవత్సరాలుగా ఎలాగైతే నడిపిస్తున్నానో దానిపై పూర్తి ఫోకస్ ఉండనే ఉంటుంది.. టెక్నికల్ వీడియోలూ, updates ఉంటూనే ఉంటాయి. అంటే టెక్నాలజీ తెలుగు ప్రజలందరికీ అందించాలన్న నా లక్ష్యం ఎక్కడికీ పోదు.. అదనంగా ఈ బాధ్యతలు అంతే!
మిత్రులు ఆదరిస్తారని ఆశిస్తూ..
– నల్లమోతు శ్రీధర్