శరీరంలో మార్పులు తెలీకుండానే జరిగిపోతూ ఉంటాయి…
నడవడం, పరిగెట్టడం రెండు వేర్వేరు పనులు…
వేగంగా నడవలేక చిన్న పరుగు లాంటిది దానితో కవర్ చేస్తున్నామంటే మన శరీరం మనకు సహకరించట్లేదని అర్థం చేసుకోవాలి…
మనిషిలోని మానసికమైన విషయాల గురించి ఆలోచించడం ఎలా అలవాటో ఫిట్నెస్ గురించి ఆలోచించడమూ నాకు అంతే అలవాటు.. ఆ అలవాటు కొద్దీ నా ప్రమేయం లేకుండానే మనుషుల కదలికల్ని గమనిస్తూ ఉంటాను…
గత కొన్నేళ్లుగా 18-27 ఏళ్ల మధ్య యువతలో చురుకుతనం చాలా లోపిస్తోంది… దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు.. బట్ దీనివల్ల చాలా మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది… చిన్నవయస్సులోనే అనేక ఆరోగ్య సమస్యలూ, వైవాహిక సంబంధాలు సరిగ్గా లేకపోవడం, ఒబేసిటీ, ఊరికే అలసిపోవడం వంటివెన్నో యువత అతి చిన్న వయస్సులోనే చవిచూడవలసి వస్తోంది.
శరీరం అదుపు తప్పి ఎక్కడక్కడ పెరిగిపోవడం.. దాంతో నడక సక్రమంగా రాక శరీరాన్ని వేలాడేసుకుని నడిచేయడం, ప్రతీ చిన్న పనికీ, దగ్గర దూరానికి కూడా బండేసుకుని తిరగడం, ఎలాంటి ఫిజికల్ ఏక్టివిటీస్ చెయ్యకపోవడం, గంటల తరబడి SMS ఛాటింగులూ, ఫేస్బుక్కుల్లో గడిపేయడం… అస్సలు శరీరాలు కదల్లేకుండా ఉండడానికి ఇలా అనేకానేక కారణాలు!!
ఎవ్వరికి ఏ విషయం చెప్పినా…. "ఆ చెప్పొచ్చారులే.. మీకు మాకు చెప్పనవసరం లేదు" అనే అతి గొప్ప ఇండివిడ్యువాలిటీలు మరో వైపు! 🙂
ఇన్ని కారణాల మధ్య ఊబకాయాలు పెరిగిపోకుండా ఉంటాయా?
30 ఏళ్లు నిండకుండానే బానెడు పొట్టలు వస్తున్నాయంటే… మరీ విచిత్రంగా ఈ మధ్య 10-15 ఏళ్లకే వచ్చేస్తున్నాయంటే… జెనెటిక్గానూ, ఆహారపు అలవాట్ల పరంగానూ ఎంత దారుణంగా తయారవుతున్నామో అర్థం చేసుకోవాలి…
ప్రపంచంలో మనం చక్కబెట్టాల్సిన పనులు ఎప్పుడూ, ఎక్కడికీ పోవు… ముందు మనల్ని మనం చక్కబెట్టుకోపోతే నిలబడిన చోటే భూమిలో కూరుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు 🙂
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com