ఓ ప్రాణం లోకం చూడలేకపోయింది.. :(

గత 17 రోజులుగా రకరకాలుగా చేసిన పోరాటం….

ప్రాణాలు వదులుకోవలసి వచ్చింది…

ఆ బాధ కూడా ఓర్చుకోగలిగే స్థైర్యాన్ని స్వంతం చేసుకున్నందుకు గర్వపడాలో… బండబారిన హృదయం చూసి సిగ్గుపడాలో….

ఈ 17 రోజులూ నా భార్య మానసికంగానూ, శారీరకంగానూ.. నేను మానసికంగానూ ఎంత నరకయాతన అనుభవించామో… అయినా నేను నార్మల్‌గానే ఉండడానికి ఎన్ని రకాలుగా ఉద్వేగాల్ని చల్లార్చుకోవలసి వచ్చిందో…

బంగారం లాంటి ఆడబిడ్డ లోకం చూడకుండానే వెళ్లిపోయింది…. ప్రెగ్నెన్సీలో హై బిపి వల్ల బాధలు పడి!!

అందుకే మొన్న మెటర్నటీ వార్డ్ గురించి ఓ పోస్టులో రాశా… మనకున్న ఈ ప్రాణం అదృష్టం మాత్రమే… దాన్ని తెలుసుకోలేకపోతున్నాం అని! ఆ అదృష్టాన్ని మా బిడ్డ దక్కించుకోలేకపోయింది…..

జాలి కోసమో, ఇంకో దానిని ఆశించో ఇది రాయట్లేదు.. బ్రతుకు విలువ ఇప్పటికైనా ఎవరికైనా అర్థమవుతుందన్న ఆశతో నేను తొక్కిపెట్టుకుంటున్న బాధని పంచుకుంటున్నా…

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్

3 Comments

  • అయ్యో ! చాలా బాధగా ఉంది.

    ఈ బిడ్డనే తిరిగి మీ ఇంట జన్మింపజేయాలని దైవాన్ని కోరుకుంటున్నాను.
    …………………………

    నిజమేనండి. మీరన్నట్లు మనకున్న ఈ ప్రాణం అదృష్టం మాత్రమే.

  • Very sorry sir…very painful to hear…I can feel how terrible ur wife must be feeling…I’m shuddering even when I’m typing this…please take care of ur wife…she suffers the most….hope she will get better soon and u guys will have a beautiful baby soon…I heart fully wish it…please take care…

  • very sad sir.

Got anything to say? Go ahead and leave a comment!