సిట్యుయేషన్ ఒక్కటే….
మనం బాధితులమనుకున్నప్పుడు ఇతరులు దోషులుగా కన్పిస్తారు…
ఇతరులూ ఆ సిట్యుయేషన్ వల్ల బాధించబడుతున్నారు అనుకున్నప్పుడు మనమైనా కొద్దిగా పరిణతి ప్రదర్శించాలనిపిస్తుంది…
అందరి కుటుంబాల్లోనూ, మనుషులూ, రిలేషన్ల మధ్యా ఒకర్నొకరు అపార్థం చేసుకునే, నొప్పింపజేసుకునే సంఘటనలు చాలానే తలెత్తుతాయి… ఎవరి ఆలోచనా స్థాయికి తగ్గట్లు వాళ్లు స్పందిస్తారు… కొద్దిగా కఠినంగా స్పందించినంత మాత్రాన వారు దోషులైపోరు…. వారిని నిందించేయకూడదు… ఒక విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన వారు సహజంగానే కఠినంగా ప్రవర్తిస్తారు…
ఉన్న మాట చెప్పాలంటే… అందరి బ్రెయిన్స్ రకరకాల మోతాదుల్లో కొద్దిగా కెమికల్ రియాక్షన్ల వల్ల ప్రభావితం చెందేవే…. కొందర్లో ఒకింత ఆవేశం.. కొందర్లో ఒకింత ఆందోళన.. మరికొందర్లో ఒకింత స్థిమితం… అంతకుమించి ఏమీ లేదు… ఏది ఎక్కువ డామినేట్ చేసిన వాళ్లు అలా స్పందించేస్తారు…
ఇదంతా ఒక సంఘటన జరిగిన తర్వాత instantగా వెలుగు చూసే బిహేవియర్ల గురించే…! ఎటొచ్చీ ఒకరు ఒక విధంగా ప్రవర్తించడానికి planned బిహేవియర్లు వేరుగా ఉంటాయనుకోండి…
Instant బిహేవియర్లని చూసి మనుషుల్ని అపార్థం చేసుకోవడం, దూరం చేసుకోవడం మాత్రం సరికాదు… నీళ్లల్లో రాయి పడ్డప్పుడు… తరంగాలు ఎంత తీవ్రంగా ఉంటాయన్నది ఎవరిచేతిలోనూ ఉండదు… అలాంటిదే అకస్మాత్తుగా జరిగే సంఘటనలకు మనుషులు ప్రవర్తించే తీరు కూడా!!
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply