మనల్ని explore చేసే వాళ్లు మనకు కావాలి… మన గురించి చాలా ఇంట్రెస్టింగ్గా తెలుసుకునే వాళ్లు మనకు కావాలి..
మనం ఎన్ని కబుర్లు చెప్పినా బోర్ కొట్టకుండా వినేవాళ్లు మనకు కావాలి..
———————-
అందుకే కొత్త స్నేహాలూ, రిలేషన్లూ ఇచ్చినంత కిక్ పాతబడిపోయిన రిలేషన్లు ఇవ్వలేవు.
నిరంతరం కొత్త వ్యక్తుల్ని అన్వేషిస్తూనే ఉంటాం. ఆ కొత్త వ్యక్తులు వారి పాత వ్యక్తుల్ని వదిలేసి మనల్నీ చాలా ఇంట్రెస్ట్‌గా ట్రీట్ చేస్తూనే ఉంటారు..
మనవీ, వాళ్లవీ అన్ని జ్ఞాపకాలూ, milestones చెప్పుకునేటప్పుడు… అవతలి వ్యక్తులు express చేసే ఉత్సుకత రానురానూ తగ్గిపోతూ ఉంటుంది. దాంతోపాటే రిలేషనూ పలుచనబడిపోతుంటుంది.
—————————-
ఈ తతంతం అంతా చూస్తుంటే… ఓ చిన్న పోలిక స్ఫురిస్తుంది…
ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మనిషి తనతోపాటు ఉన్న ఈ ప్రపంచంలో బ్రతికి ఉన్న ప్రతీ ఒక్కరికీ తనని తాను వ్యక్తపరుచుకునే ప్రయత్నం చేస్తూ పోయే కొద్దీ ఎక్కడోచోట మరణం సంభవిస్తుంది.. 🙂
వ్యక్తపరుచుకోవడం, ఆసక్తి చూపడం అన్న రెండు అంశాల దగ్గరే రిలేషన్లు బలపడుతున్నాయీ, బలహీనపడుతున్నాయి…
మీరు ఏదైనా express చేస్తే.. దాని పట్ల నేను ఏమాత్రం interest చూపించకపోతే… సహజంగానే మీరు నాకు మాగ్నటిక్లా అతుక్కుపోరు.
సరిగ్గా ఈ బలహీనతను ఆధారంగా చేసుకునే.. అన్నీ ఆసక్తిగా వింటున్నట్లు నటిస్తూ… వెనకాల పగలబడి నవ్వుకునే, చులకన చేసే జనాభా ఎక్కువైపోతున్నారు. వాళ్ల నిజమైన నైజం అర్థమయ్యేవరకూ వాళ్లతో మనం చాలా అటాచ్డ్గానూ ఉంటున్నాం.
———————————
ఎప్పుడూ కొద్దిరోజులైనా ఎవరికో ఒకరికి “ప్రత్యేకమైన వ్యక్తి”గా ఉండడం కోసం కొత్త స్నేహాలు వెదుక్కోవడం పెద్ద బలహీనత. అది పాల నురగలా పొంగుతుందీ.. చల్లారిపోతుంది. మన పట్ల, మన expressions పట్ల ఇతరులు ఆసక్తి చూపాలన్న ఓ బేసిక్ బలహీతనే మనల్ని మనం కాకుండా చేస్తోంది. మనం express చేయొచ్చు, మనకు చాలా అనుభవాలూ, చెప్పుకోవాల్సినవి చాలానే ఉండొచ్చు.. అవి చెప్పుకోవడంలో తప్పులేదు.. కానీ అవి ఇతరులచే ఆసక్తిగా వినబడాలన్న కోరికే మనల్ని నిలువునా ముంచేస్తుంది.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply