ఎవరో ఏదో ఒక అర్థంతో అంటారు..
మనం మరో అర్థంతో అపార్థం చేసుకుంటాం. కానీ మనం చాలా మెచ్యూర్డ్.. 🙂
ఎంత మెచ్యూర్డ్ అంటే మనల్ని ఎవరైనా వేలెత్తి చూపినా మనం నమ్మింది చేసుకుంటూ వెళ్తామన్నంత ధీరోదాత్తులం..
అదే సమయంలో ఎవరూ వేలెత్తి చూపకపోయినా ప్రతీ విషయాన్నీ మనకు ఆపాదించుకుని భుజాలు తడుముకుని ముడుచుకుపోయేటంత ఇమెచ్యూర్డ్లం 🙂
అది ధూషణ అయినా, నిష్టూరమైనా, తిరస్కారమైనా.. ఏ విషయం ఎవరికి అప్లై అవుతుందో వారికి వారికెలాగూ ఆటోమేటిక్‌గా అప్లై అవుతుంది..
మనకు అప్లై కాని విషయాన్ని మనం బుర్రలోకి తీసుకుని.. "వాడేదో నన్నే తిట్టాడు" అని శత్రుత్వాలు పెంచుకోవడమెందుకు?
మనం మాటల్ని, మనుషులతో సందర్భాలతో relate చేసుకోవడం వల్ల వస్తున్న తంటా ఇదంతా!
అదెలాగో చెప్పేదా.. ఈ టాపిక్‌నే తీసుకుందాం.
చాలామంది ఈ టాపిక్‌ని చదివి విషయాన్ని గ్రహించడం కన్నా.. ఈ టాపిక్‌ని నేను ఏ contextలో రాశానో.. నిన్నా, మొన్నా నా ప్రవర్తన ఎలాగుందో, శ్రీధర్ గారికి ఇప్పుడు ఎవరైనా ఇలా అపార్థం చేసుకున్న వాళ్లు తగిలారో.. ఇలా పలు పలు విధాలుగా లోపల్లోపల ఆరాలు తీసుకుని చివరకు ఓ ఈయన ఇందుకు రాశాడు కాబోలు అని వాళ్లకు వాళ్లు అనుకుంటారు.
సో ఓ పదిమంది క్లోజ్డ్ గ్రూప్ ఉన్నారనుకుందాం.. కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఆఫీస్ కొలీగ్స్ కావచ్చు వాళ్లు.
ఒకరికి ఒకరు తెలీకుండానే అప్రమేయంగా ఒకర్నొకరు గమనిస్తూ ఉంటారు.. moodsనీ, సిట్యుయేషన్స్నీ, బాహ్య ప్రపంచంలో వాళ్ల ప్రవర్తననీ!
సో వాళ్ల షూస్‌లో వీళ్లు కాళ్లు పెట్టి నడుస్తుంటారు.. ఐ మీన్ వాళ్లకంటే ముందే అన్నీ వీళ్లే ఊహించేసుకుంటూ ఉంటారు.
సో ఆ క్లోజ్ గ్రూప్‌లో ఏ ఇద్దరికో కొద్దిగా అభిప్రాయ బేధాలు ఉన్నాయనుకుందాం. వేరే రీజన్ దేనితోనో ఆ ఇద్దరిలో ఒకరు ఏదో మాట్లాడారో, రాశారో అనుకుందాం. మిగతా గ్రూప్ సభ్యులంతా "ఓ తను ఆ రెండో వ్యక్తిని గురించే అలా అన్నారు" కాబోలు అని డిసైడ్ చేసి పారేస్తారు 🙂
సో మనం దేన్నీ దేనితోనూ relate చేసుకోకుండా ఆలోచిస్తే అంతా సవ్యంగానే కన్పిస్తుంది.
మరో చిన్న ఉదాహరణ చెప్తాను..
ఈరోజు నేను ఓ స్టేటస్ పెట్టాను… "What we share matters more to Society.." అని! అందులో టైమ్‌పాస్, ఎంటర్టైన్మెంట్ల గురించి ప్రస్తావించాను.
దీన్ని చాలామంది చాలా రకాలుగా అర్థం చేసుకునే అవకాశముంది.
ఒకాయన అంటారు.. "ఈయనేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్లు" అని! 🙂
మరొకావిడ అనుకుంటుంది.. "మాకు నచ్చినట్లు బ్రతికే స్వేచ్ఛ కూడా మాకు లేదా.. ఈయనెవరు చెప్పడానికి అని" 🙂
మరో వ్యక్తి అనుకుంటారు.. "నేనెక్కువ పొలిటికల్ ఇష్యూస్ గురించి రాస్తుంటా కదా.. ఈయన నన్ను ఉద్దేశించే రాశారు.. అర్జెంటుగా unfriend చేసి పారేయాలి" అని!
ఇక్కడ ఇంకా ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఎవరెలా అనుకుంటారు అన్నది కూడా నా ఊహే. అలాంటి ఊహలతో, "ఎవరెలా అనుకుంటారో నాకెందుకులే"… అని నేను రాయకుండా కూర్చుంటే ఆ ఇమెచ్యూర్డ్ మెంటాలిటీని నేనూ మోస్తున్నట్లే.
సో మన మెచ్యూరిటీలు సానబెట్టుకోపోతే.. మనుషుల్ని, వారి మాటల్నీ, విషయాల్నీ, చేతల్నీ.. సవ్యంగా ఇంటర్ప్రెట్ చేసుకోపోతే మానసికంగా నష్టపోయేది మనమే!! 🙂 🙂
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply